**శ్రీ గురుభ్యో నమః **
అగ్ని పురాణం లో చెప్పబడిన ఉపవాసాలు - పరిహారాలు - ఫలితాలు :
అగ్నిదేవుడు స్వయంగా వశిష్టుడి తో చెప్పినది అగ్నిపురాణం. దీనినే వశిష్ఠుడు వ్యాసుడితో చెప్పారు. 15000 శ్లోకాలతో వుండే అగ్నిపురాణం లో చెప్పబడిన పరిహారాలు కొన్ని ఈ కింద ఇవ్వబడ్డాయి.
మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ/ధ్యానం చేస్తూ ఏ రోజుల్లో ఉపవాసం చేస్తే ఏ ఫలితమో ఈ కింద ఇవ్వబడ్డాయి .
1.ఆదివారం ,హస్తా నక్షత్రం ఒక సంవత్సరకాలం లో ఎన్ని సార్లు ఓస్తే అన్ని సార్లు రాత్రి పూట మాత్రం ఆహారం తీసుకోవడం వల్ల అనుకున్న వి నెరవేరుతాయి.
2.సోమవారం,చిత్తా నక్షత్రం కలిసి వొచ్చినప్పుడు అలాంటి 7 రోజులు రాత్రి పూట మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరి సంతోషం కలుగుతుంది.
3. మంగళవారం ,స్వాతీ నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే అన్ని కష్టాలూ తొలగిపోతాయి.
4.బుధవారం,విశాఖా నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి.
5.గురువారం,అనూరాధా నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయి.
6. శుక్రవారం,జ్యేష్టా నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయి
7. శనివారం,మూలా నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయి.