బుధ ధ్యాన శ్లోకాలు :
1. సింహారూఢం చతుర్భుజం ఖడ్గం చర్మ గదాధారం
సోమ పుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్ధ సిద్ధిదం
సోమ పుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్ధ సిద్ధిదం
2. ప్రియంగు కళికా శ్యామం రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం
3. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్
బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే
బుధ గాయత్రీ మంత్రములు :
1. ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహీ తన్నో దంతిః ప్రచోదయాత్
2. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్
3. సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య: ప్రశోదయాత్
4. ఆత్రేయాయ విద్మహే ఇందు పుత్రాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్
5. ఓం గజధ్వజాయ విద్మహే సుఖ హస్తాయ ధీమహి తన్నో బుధ: ప్రచోదయాత్
6. క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ దేమహీ తన్నో బుధ: ప్రచోదయాత్
7. ఆత్రేయాయ విద్మహే సోమ పుత్రాయ ధీమహీ తన్నో బుధ: ప్రచోదయాత్
పై శ్లోకాలు ,మంత్రాలలో ఏదైనా 17,000 సార్లు జపం చెయ్యడం ,బుధ గ్రహానికి సంబంధించిన దానాలు చెయ్యడం వల్ల బుధ గ్రహ దోషాలు జాతకం లో ఉంటే తొలగిపోతాయి
బుధ గ్రహ ప్రత్యేక పరిహారాలు :
1. బుధ వారం రోజు పురుష సూక్తం,విష్ణు సూక్తం,నారాయణ సూక్తం పారాయణ చెయ్యాలి
2. బుధవారం రోజున బ్రాహ్మణుడికి ఆకు కూరలు దానం చెయ్యాలి
3. 17 బుధ వారాలు వేంకటేశ్వర స్వామికి తులసి మాలలు సమర్పించాలి
4. గోవుకు పచ్చగడ్డి ,పెసలు ఆహారముగా సమర్పించండి
5. బ్రాహ్మణుడికి ఆకుపచ్చని వస్త్రం లో ఆకుకూరలు,పెసలు ,మరకతం దానం చెయ్యాలి
6. బుధ గ్రహ మూల మంత్రం 17000 సార్లు జపం బ్రాహ్మణుడితో చేయించి తగిన దానాలు చెయ్యాలి
7. గరిక తో ,చెరుకు ముక్కల తో పెసలు సమర్పిస్తూ నారాయణ హోమం చేయాలి