Thursday, March 10, 2022

కుంభ రాశి లో బుధుడు - బుధ గురు సంయోగం - బుధ గ్రహ పరిహారాలు


కుంభ రాశి లో బుధుడు - బుధ గురు సంయోగం - భగవద్గీతా పారాయణం - బుధ గ్రహ పరిహారాలు

మార్చ్ 6 వ తారీఖున బుధుడి కుంభ రాశి ప్రవేశం జరిగింది. మార్చ్ 24 వ తారీఖు వరకు కుంభ రాశి లోఉండి ఆ తరువాత మీన రాశి ప్రవేశం చేస్తాడు బుధుడు.
మార్చ్ 21 న ఉ 11.30 ప్రాంతం లో కుంభ రాశి లో నే ఉన్న గురు గ్రహం తో డిగ్రీల పరం గా అతి దగ్గిర సంయోగం లో బుధ గురు గ్రహాలు వుంటారు.
ఈ సంయోగం ముఖ్యం గా మిధున,కన్యా రాశుల వారికీ బుధ నక్షత్రాలైన ఆశ్లేషా, జ్యేష్టా,రెవతీ వారికి, ధను, మీన రాశుల వారికి, గురు నక్షత్రాలైన పునర్వసు,విశాఖ, పూర్వాభాద్రపద వారికీ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
ఈ సంయోగానికి వ్యయం లో శని ఉండడం వల్ల పైన చెప్పబడిన రాశుల,నక్షత్రాల వారికి ఖర్చులు,నిద్ర,బద్ధకం పెరిగే అవకాశం ఉంది. మెలకువగా ఉండాలి.
ఈ సంయోగం వల్ల advertising , digital marketing చేసే వారికి బాగా అనుకూలమైన కాలం.
అలాగే సమస్యలకు మంచి ఉపాయాలు తోచే కాలం కూడా.

ఈ సమయం లో భగవద్గీత పారాయణం చాలా పుణ్యం.

బుధ దశ జరుగుతున్న వారూ , జాతకం లో బుధుడు నీచ లేదా దుస్థాన స్థితి లో ఉన్నవారూ బుధ గ్రహ జపం /హోమం చేయించుకోవడానికి అద్భుతమైన సమయం మార్చ్ 24 వరకు.

ఈ సమయం లో (మార్చ్ 6 నుండీ 24 వరకు) ' ఓం గం గణపతయే నమః' మంత్రం రోజూ 108/54 సార్లు ధ్యానం చెయ్యడం మంచి ఫలితాలనిస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణ లేదా శ్రవణం , 'ఓం విష్ణవే నమః' మంత్ర ధ్యానం, మొక్కలు నాటడం, మీ ఇంటి పురోహితుడికి ఆకు కూరలు దానం చెయ్యడం వల్ల మంచి ఫలితాలుకలుగుతాయి.