ఈ రోజు చైత్ర శుక్ల దశమి, పుష్యమీ నక్షత్రం, శుక్ర వారం.
యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా, దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలు పోయేట్టు ప్రయత్నాలు చేసినా యముడి
దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. భూలోకంలో ధనిక, పేద వర్గాలు ఉన్నా ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్లిన జీవులే అవుతారు.
ఏమిటీ ధర్మరాజ దశమి!!
చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే మరణభయం తొలగిపోతుందని పెద్దలు, మరియు శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ రోజు చెయ్యవలసిన పరిహారాలు స్తోత్రాలు:
1. ధర్మ రాజు ప్రతిష్టించిన మంగళ గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం దర్శించుకోవడం.
2. ఈ క్రింది స్తోత్రాన్ని 11 సార్లు పారాయణ చెయ్యడం :
యమాయ ధర్మరాజాయ మృత్యవే చాన్తకాయ చ |
వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ |
ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే |
వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః |
3. కఠోపనిషత్తు లో చెప్పబడిన నచికేత వృత్తాంతం చదవడం లేదా వినడం.
శివరామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435