Wednesday, May 3, 2023

మే నెలలో విశేషమైన రోజులు

 


మే నెలలో విశేషమైన రోజులు :


05.05.2023 : మహా వైశాఖి. సముద్ర నదీ స్నానం, పితృ తర్పణాలు,మీ పురోహితుడిని సంప్రదించి తగిన దానాలు చెయ్యడం వల్ల సర్వ పాపోపశమనం.

09.05.2023 : మంగళ వారం . భౌమ చతుర్ధి. గణపతి పూజ మహా ఫల ప్రదం.

19.05.2023 : శుక్రవారం. అమాకృత్తికా యోగం. అమావాస్య కృత్తిక నక్షత్రం కలవడం వల్ల ఏర్పడిన యోగం. పితృ తర్పణాలు ఇవ్వడం వల్ల వారికి యుగాయుత తృప్తి.

23.05.2023 , మంగళ వారం : మహా భౌమ చతుర్ధి . గణపతి పూజ మహా శుభ ఫల ప్రదం .

25.05.2023 , గురువారం : గురు పుష్య యోగం . పుష్యమీ నక్షత్రం, గురువారం కలిసి రావడం వల్ల ఏర్పడిన మహా శుభ యోగం. చాలా పనులకు శుభ కాలమని సాంప్రదాయం. ఈ రోజున విద్యార్జన మొదలు పెడితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఉపదేశం తీసుకున్న మంత్ర సాధన ఈ రోజున మొదలు పెడితే మంత్ర సిద్ధి కలుగుతుంది