Sunday, May 7, 2023

గ్రహ సమాచారం

గ్రహ సమాచారం: 

మే 10న కుజుడు మిధున రాశి నుండి కర్కాటక రాశికి మారతాడు. కర్కాటక రాశి కుజుడు నీచ స్థితి పొందే రాశి. 
మే 15న వృషభ సంక్రాంతి అంటే సూర్యుడు వృషభరాశి ప్రవేశం చేస్తాడు. 

మే 15 వరకు మేషరాశిలో రవి బుధ రాహు గురువులు కలిసి చాతుర్గ్రహ కూటమి ఏర్పరుస్తూ ప్రభావం చూపిస్తున్నారు.

పాకిస్తాన్ దేశ  జాతకం ప్రకారం స్వాతంత్య్రం వొచ్చిన సమయానికి మేషం లగ్నం. 

అదే మేషరాశిలో గురువు రాహువు తో కలిసి గురు చండాల యోగం ఏర్పరచడం అలాగే బుద్ధుడు వక్రస్థితిలో శత్రు రాశిలో ఉండడం వల్ల పాకిస్తాన్ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విదేశీ మారక నిల్వలు రోజురోజుకీ తగ్గిపోయి పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. 

మేష రాశి తూర్పు దిశను సూచించే రాశి అంటే మన దేశం లో తూర్పున వున్న రాష్ట్రమైన  పశ్చిమ బెంగాల్  రాబోయే రోజుల్లో తుఫాను ఎదుర్కోబోతోంది.  మే 10న మేష రాశికి అధిపతి అయిన కుజుడు జలతత్వ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశం తర్వాత ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా భారతదేశపు తూర్పు రాష్ట్రాల కోస్తా ప్రాంతాల మీద పడుతుంది. 

మణిపూర్ లో   హింస/ అలజడులు:  భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను సూచించేది మీనరాశి. ఈ మీన రాశి ప్రస్తుతం పాపకర్తరీ యోగంలో ఉంది. కుంభంలోని శని, మేషరాశిలోని చాతుర్ గ్రహ కూటమి వల్ల ఈ అలజడులు జరిగాయని చెప్పొచ్చు. 

కుజుడి కర్కాటక రాశి ప్రవేశం - దాని ప్రభావాలు: కర్కాటక రాశి దక్షిణ దిశను సూచించే రాశి. పైగా జలతత్వ రాశి. మే 10న కుజుడి ప్రవేశంతో దక్షిణ భారతదేశంలోని కోస్తా ప్రాంతాలు అకాల వర్షాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుజుడి నీచ స్థితి వల్ల నదుల్లోనూ సముద్రంలోనూ ప్రయాణించే పడవలు మర బోట్లు వంటి వాటికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 

గురు రాహువుల యుతి- గురు చండాల యోగం- ప్రభావం: 
ఈ గురు రాహువుల యుతి మేషరాశిలో జరుగుతూ ఉండడం వల్ల తూర్పు/ఈశాన్య ప్రాంతాల్లో ఉండే మత గురువులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. 

ఈ యుతి వల్ల  మేషరాశి ప్రభావం చూపించే యూరప్ దేశాల మీద ఆర్థికమాంద్యం ప్రభావం ఉంటుంది. బ్యాంకింగ్ రంగం షేర్ లు మార్కెట్లో హెచ్చుతగ్గులు, నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.  యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు పాటించే ఆర్థిక విధానాలు విమర్శల పాలవుతాయి.