Wednesday, April 26, 2023

రేపటి - 27. 04. 2023 - రాశి ఫలితాలు


మేష రాశి : ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. దైవ కార్యాలు చేస్తారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. కొన్నిసార్లు అతిగా మాట్లాడి ఇబ్బందుల్లో ఎదుర్కొంటారు. విద్యా విషయాల్లో మంచి పురోగతి సాధిస్తారు. స్నేహితుల కలయికతో సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. 

వృషభ రాశి : వృత్తి వ్యాపారాల్లో పురోగమిస్తారు. పిల్లల పురోగతి మీకు సంతృప్తిని ఇస్తుంది. తోడబుట్టిన వాళ్లతో మంచి సఖ్యత ఉంటుంది. దూరప్రాంత ప్రయాణానికి ప్రణాళికలు వేస్తారు. సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు అతి ప్రయత్నం మీద జరుగుతాయి. నిజాయితీతో వ్యవహరిస్తారు. మాట్లాడే ముందర ఆలోచించి మాట్లాడటం మేలు. శత్రువులపై విజయం సాధిస్తారు.

మిధున రాశి: మీకు అండగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యుత్ రంగంలోని వారికి మంచి లాభాలు. తీర్థయాత్రలు చేస్తారు. పిల్లల పురోగతి విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది. ఆదాయం బాగుంటుంది.

కర్కాటక రాశి: ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల వల్ల మంచి కలుగుతుంది. పిల్లల పురోగతి విషయాల్లో కొంత ఆందోళన చెందుతారు. మీ వాక్యాతుర్యం ప్రదర్శించి కార్యసాధన చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ తెలివితేటలు వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు పొందుతారు. మీ అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆస్తి పంపకాల్లో లాభపడతారు. అష్టమ శని వల్ల కొంత ఆందోళన అయితే ఉంటుంది.

సింహరాశి: ఆస్తులు వృద్ధి చెందుతాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. విదేశీ వ్యాపారాల్లో వ్యవహారాల్లో అనుకూలతలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యంగానే ఉంటారు. పిల్లల పురోగతి విషయంలో సంతృప్తి చెందుతారు. దూర ప్రయాణాలు చేసే ఆలోచన చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కన్యా రాశి: ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణాలు తీర్చేస్తారు. అష్టమ రాహు  ప్రభావం ఉంది గనుక కొన్ని విషయాలలో ఆటంకాలు ఆలస్యాలు ఉంటాయి. రాహు కేతువులకి పూజలు చేసుకుంటూ ఉండాలి. ఆదాయం బాగుంటుంది. ఏ పని చేసినా విజయం లభిస్తుంది. 

తులారాశి: క్రమ పద్ధతిలో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. వేరే వాళ్ళు చెప్పేది మీకు సరిపడుతుందా లేదా అని జాగ్రత్తగా పరిశీలించి ఏ విషయంలో అయినా నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం బాగుంటుంది. పిల్లల విషయాల్లో పురోగతి బాగుంటుంది. విద్యా విషయాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏదో తక్కువైనట్టుగా మనసులో అసంతృప్తి ఉంటుంది. రాహు కేతువులకు పూజలు చేసుకోవాలి. 

వృశ్చిక రాశి: విద్యా విషయాలలో మంచి పురోగతి ఉంటుంది. నిద్రలేమితో బాధపడతారు. దూర ప్రాంత ప్రయాణాలకు ప్రణాళికలు ఫలించకపోవచ్చు. స్నేహితులు అండగా ఉంటారు. మంచి విజయం ఉంది. ఆదాయం బాగుంటుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహన యోగం ఉంది. 

ధనస్సు రాశి: తోడబుట్టిన వారు అండగా ఉంటారు. ధరి సాహసాలు ప్రదర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉంది. కష్టపడిన తర్వాత ఫలితం దక్కుతుంది. అదృష్టం కొద్దిగా తక్కువగా ఉంది. కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం ఉండకపోవచ్చు. విదేశీ వ్యాపారాలు
లాభించవు. 

మకర రాశి: ఆస్తులు కూడ పెడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కానీ జీవిత భాగస్వామితో కొంత సఖ్యత తక్కువగా ఉంటుంది. అదృష్టం మీవేపే ఉంటుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆదాయం బొటాబొటి గా ఉంటుంది. పిల్లలు విషయంలో ఆందోళన చెందుతారు.

కుంభరాశి: ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. కొన్ని పరిస్థితుల్లో అసహనానికి గురవుతారు. అనుకున్న పనులు ప్రయత్నం మీద జరుగుతాయి. అదృష్టం కొద్దిగా తక్కువగా ఉందనే చెప్పాలి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విద్యా విషయంలో విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలించవు.

మీన రాశి: ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనే ప్రయత్నాలు అలుస్తాయి. కొంత అసహనంగా ఉంటారు. ఈ రాశి వారు కొందరు ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు.