Thursday, April 27, 2023

రేపటి రాశి ఫలితాలు - 28. 04. 2023


మేషరాశి : చర్మ సంబంధమైన ఎలర్జీలు ఇతర చికాకులు ఉండొచ్చు. ఆర్ధిక పరిస్థితి పరవాలేదు అనిపిస్తుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం బాగుంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్టర్లకి, రచయితలకి, హోటల్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. నీతి నిజాయితీతో వ్యవహరించండి. భాగస్వామ్య వ్యాపారాలు లాభించవు.

వృషభ రాశి: సంతోషంగా ఉంటారు. సినిమాలకి షికారులకి వెళ్తారు. నిద్రలేమితో నూ, కాళ్ల నొప్పులతో నూ, బాధపడతారు. కొందరికి ఎడం కన్ను కి సంబంధించిన చికాకులు ఉండొచ్చు. ఖర్చులు ఎక్కువగా చేస్తారు. మొత్తానికి అనుకున్నవన్నీ సాధిస్తారు. కొందరికి ప్రమోషన్లు వచ్చే సమయం. ఆదాయం బాగానే ఉంటుంది.

మిధునరాశి: విద్యా విషయాలలో పురోగతి బాగుంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో అసహనంతో ఉంటారు. అదృష్టం మీ వైపే ఉంటుంది. రెండు మూడు రకాల ఆదాయాలు ఉంటాయి. పై అధికారులతో మాట పడవలసి రావచ్చు జాగ్రత్తగా ఉండండి.

కర్కాటకరాశి: వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఆస్తి పంపకాలలో లాభపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్టర్లు, ఫార్మసీ వ్యాపారంలో ఉన్నవాళ్లు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు మంచి ప్రగతి సాధిస్తారు.

సింహరాశి: భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఆస్తులు పెరుగుతాయి. వాక్చాతుర్యంతో ఎంతటి వారినైనా కన్విన్స్ చేయగలరు. హోటల్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు మంచి పదవులు ఆశించవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.

కన్యారాశి: ఆరోగ్యం బాగుంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు చేయగలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యా విషయాలలో పురోగతి బాగుంటుంది. తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. తీర్థయాత్ర లు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో కూడా కొన్ని పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి.

తులారాశి: పిల్లల పురోగతి విషయంలో సంతృప్తిగా ఉంటారు. మనశ్శాంతిగా ఉంటుంది. ధైర్య సాహసాల తో కొన్ని పనులు సాధిస్తారు. మనసు ఆందోళనగా ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చు అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, ఫార్మసీరంగంలో ఉన్నవారు లాభపడతారు

వృశ్చిక రాశి: జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండొచ్చు. అష్టమ కుజ సంచారం వల్ల వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలు చేస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యా విషయాలలో పురోగతి బాగుంటుంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు కొంత ప్రయత్నం మీద పనులు నెరవేరుతాయి. రచయితలకు, అకౌంటెంట్లకు, టెక్స్టైల్స్ రంగంలోని వారికి లాభాలు ఉంటాయి.

ధనస్సు రాశి: ఆరోగ్యం బాగుంటుంది. ఆట పోటీల్లో విజయాలు సాధిస్తారు. మనసు కొద్దిగా ఆందోళనగా ఉంటుంది. కొందరికి ప్రమోషన్లు వచ్చే సమయం. సంఘంలో మీ పరపతి పెరుగుతుంది. అధికార యోగం ఉంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మంచి పేరు గడిస్తారు.

మకర రాశి: ఆస్తులు కూడా పెడతారు. భోజన సౌఖ్యం ఉంది. సంతాన విషయంలో ఆందోళన చెందుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అంతగా లాభాలు ఉండవు. విదేశీ వ్యాపారాల్లో కూడా అంత అనుకూలత ఉండదు. అదృష్టం మీ వైపే ఉంది. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దైవకార్యాలు చేస్తారు.

కుంభరాశి: ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆదాయం బాగుంటుంది. ఇంతకు ముందర ఇచ్చిన అప్పులు వెనక్కి వస్తాయి. తండ్రితో సంబంధాలు అంత సంతృప్తిగా ఉండవు. కొన్ని విషయాల్లో అసహనానికి గురవుతారు. ప్రయాణాలు లాబిస్తాయి.

మీన రాశి: వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రగతి సాధిస్తారు. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. మీకు రావలసిన డబ్బులు ఆలస్యం అవుతాయి. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు అంతకుమించి ఉంటాయి .