Monday, April 3, 2023

అజైకపాదుడు - పూర్వాభాద్ర నక్షత్రము

పూర్వాభాద్ర నక్షత్రమునకు అజైకపాదుడు దేవతగా చెప్పబడ్డాడు. అజైకపాదుడుని రుద్ర రూపముగా కొన్ని చోట్ల, ఆదిత్య రూపమని కొన్నిచోట్ల చెప్పబడింది.

అజైకపాదుడు అంటే గొట్టెల కాపరి అనే అర్థం చెప్పబడింది. ఏకాదశ రుద్ర రూపములలో ఒకటి. అయితే బ్రహ్మమానస పుత్రులు అనేచోట అజుడు, ఏకపాదుడు అని వేరు వేరు పేర్లు చెప్పబడ్డాయి. 

వేదములలో ఊళలు పెట్టే క్రూరమైన తుఫానుల దేవతలనే రుద్రులని వర్ణన చేయబడింది. అశ్వధమనులు మండుచున్న సువర్ణ  యజ్ఞకుండము నుండి క్రూర జంతువుల ముఖములు కలిగిన జీవుడు ఉద్భవించడం చూసినారు. వీరు రుద్రుని ఏకాదశ శిష్యగణముగా ఉన్నారు. వీరు నరమాంసము భుజించుట, రక్తము త్రాగుట మరియు శివుని కొనియాడుట చేస్తారు. 

మరుగుజ్జుతనము, అసహ్యకరమైన జంతువుల క్రూర రూపములు కలిగి భూమిపై తిరుగుతూ
ఉంటారని చెప్పబడింది.

అజైకపాద అజ. ఏకపాద అంటే ఏకపాదముతో జన్మించినవాడు, ఇది వృత్తుని తండ్రిగా సూచించబడిందని కొన్ని చోట్లచెప్పబడింది.