Thursday, April 6, 2023

శుక్రహోర

 

శుక్రహోరకు అధిపతి శుక్రుడు. శుక్రవారం లేదా చంద్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రములలో సంచరిస్తున్నపుడు శుక్రహార సమయంలో శుక్రుని ప్రభావం ఎక్కువగా వుంటుంది.

శుక్రహోర కఠినహృదయాలు సైతం కరుణ, ప్రేమతో నిండే సమయం. ఈ సమయంలో మీ మిత్రునికో, మిత్రురాలుకో, భార్య, భర్తకో ప్రియునికో, ప్రియురాలికో ఉత్తరాలు వ్రాయండి. ఆ ఉత్తరాలు ఎదుటివారిని ఆకర్షిస్తాయి.
ఎవరైనా కోపిష్ఠి, మూర్ఖుడు, కఠినుడు అయిన వ్యక్తిని కలవటానికి 'శుక్రహోర’ను ఎన్నుకోండి. ఆ సమయంలో ఆ వ్యక్తి మీరు చెప్పిన విషయాన్ని సహనంతో వింటాడు. మీకు శాంతంగా సమాధానం యిస్తాడు. పెళ్ళిచూపులకు శుక్రహోర సమయం ఉత్తమం. నగలు, పట్టుచీరలు,రత్నాలు, గంధము, గ్లాసు సుగంధ ద్రవ్యములు మొదలైన అలంకారవస్తువులు
కొనుటకు శుక్రహోర ఉత్తమమైనది.
ఏదైనా వాహనం కొనుటకు శుక్రవారంనాటి శుక్రహోర అత్యుత్తమమైనది.సినిమాథియేటర్లు, స్టూడియోలు, ఫోటో స్టూడియోలు, సంగీత కళాశాలలు,పాఠశాలలు, కళాశాలలు శుక్రవారం శుక్రహోరలో ప్రారంభించుట శుభదాయకం.
తోళ్ళు, చర్మముతో కూడిన పరిశ్రమలు లేదా సంస్థలు, అనాధ సంక్షేమ గృహాలు మొదలగు వాటిని ప్రారంభించుటకు శనివారం శుక్రహోర అనుకూల సమయం.
పాడిపరిశ్రమ (మిల్క్డైరీ) ప్రారంభించుటకు సోమవారం నాటి శుక్రహోర అనుకూల సమయం.బియ్యం వ్యాపారం చేయటానికి మంగళవారం శుక్రహోర శుభసమయం.
బిస్కట్లు, చాక్లెట్లు, పండ్లు, పూలు, కూరగాయలు, సిల్కుచీరలు, స్త్రీల అలంకరణ సామగ్రి, మందులు వ్యాపారాలు ప్రారంభించుటకు బుధవారం
శుక్రహోర సరియైన సమయం. ఈ సమయంలో 'హనీమూన్' కూడా ఆనందదాయకం.
తల్లి, పిల్లల హాస్పిటల్, పశువుల ఆసుపత్రి, ఆదాయపు పన్నుశాఖ, న్యాయం,కోర్టువంటి వాటికి సంబంధించిన ఆఫీసులను ప్రారంభించటానికి (లేదా) ఈ
శాఖలలో ఉద్యోగంలో చేరటానికి గురువారం శుక్రహోర శుభసమయం.
దేవి ప్రార్థన శుభాన్ని కలుగజేస్తుంది.