Friday, April 7, 2023

శ్రీ మానసా దేవి స్తోత్రం



అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం. కోరిన కోర్కెలు తీర్చి, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించు, శ్రీ మానసా దేవి స్తోత్రం. జాతక చక్రం లో ని సర్ప దోషాలను ఉప శమింప చేసే స్తోత్రం .

జనమేజయుడు చేసిన సర్పయాగం వల్ల నాగ జాతి అంతరించి పోయే ప్రమాదం కలిగినప్పుడు ఆ సర్ప యాగాన్ని ఆపు చేయించిన అస్తీక మహర్షి తల్లి మానసా దేవి. 

జరత్కార మహర్షి కీ మానసా దేవి కీ పుట్టిన వాడే ఆస్తీక మహర్షి. 

మానసా దేవి స్తోత్రమ్..!!

ధ్యానం..
చారుచమ్పకవర్ణాభాం సర్వాఙ్గసుమనోహరామ్ |
నాగేన్ద్రవాహినీం దేవీం సర్వవిద్యావిశారదామ్ ||

శ్రీనారాయణ ఉవాచ..

నమః సిద్దిస్వరుపాయై వరదాయై నమో నమః |
నమః కశ్యపకన్యాయై శంకరాయై నమో నమః || ౧||

బాలానాం రక్షణక్య నాగదేవ్యై నమో నమః |
నమ ఆస్తీకమాత్రే తే జరత్కార్వ్యై నమో నమః ॥ ౨॥

తపస్విన్యై చ యోగిన్యై నాగస్వస్తే నమో నమః |
సాధ్వ్యై తపస్యారుపాయై శమ్బుశిష్యే చ తే నమః || ౩ ||

|| ఫలశ్రుతిః ||

ఇతి తే కథితం లక్ష్మి మనసాయా స్తవం మహత్ |
యః పఠతి నిత్యమిదం శ్రావయేద్వాపి భక్తితః ||
న తస్య సర్పభీతిర్వై విప్యమృతం భవతి |
వంశజానాం నాగభయం నాస్తి శ్రవణమాత్రతః ||

|| ఇతి శ్రీ మానసా దేవి స్తోత్రమ్ సంపూర్ణం ||